అదనపు కలెక్టర్ నగేష్ కు ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ

మెదక్ జులై 04 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి పి. దుర్గేష్ గౌడ్  మెదక్ జిల్లా లో సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు ఎన్యుమరేషన్ పత్రాలను బిఎల్వోలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. జిల్లాలో సర్ ప్రక్రియ వేగవంతంగా జరగాలని, ప్రజలందరినీ భాగస్వాములు చేసి, 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్ గా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ తహసిల్దార్ సింధు రేణుక,తదితరులు పాల్గొన్నారు.